రాహుల్ గాంధీపై శర్మిష్టా ముఖర్జీ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ముఖర్జీ తీవ్రంగా విమర్శించారు. రాజకీయాలంటే 24 గంటలూ, ఏడాది పొడవునా కొనసాగే బాధ్యత అని, కొద్ది రోజులు ప్రజల్లో ఉండి మాయమయ్యే వ్యవహారం కాదని ఆమె అన్నారు. 2014 నుంచి కాంగ్రెస్ ఎన్నికల్లో ఓటములు చవిచూస్తోందని, ఇది రాహుల్ నాయకత్వ వైఫల్యమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పొత్తులపై ఆధారపడుతోందని, సొంతంగా బలోపేతం కావడంపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్