కాలేజ్‌కు వెళ్లమన్నారని.. ఆత్మహత్య చేసుకుంది

TG: కాలేజీకి వెళ్లమన్నందుకు ఓ ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లి గ్రామానికి చెందిన అరిగె కృష్ణ కూతురు సింధూజ (19) మెదక్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. నెల రోజులుగా కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. కళాశాలకు వెళ్లాలని కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన సింధూజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.

సంబంధిత పోస్ట్