నా కూతురును రెచ్చగొట్టినందుకే విమర్శించింది: కొండా సురేఖ

TG: సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురును రెచ్చగొట్టినందుకే సీఎంని విమర్శించిందని అన్నారు. ఆయనకు ఏం హక్కు ఉందని పరకాల అభ్యర్థిని ప్రకటిస్తారని నిలదీశారు. తనపై చర్యలు తీసుకునే ముందు, సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలని సురేఖ డిమాండ్ చేశారు. పదేళ్లపాటు తానే సీఎం అనే అధికారం రేవంత్ రెడ్డికి ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. అది క్రమశిక్షణా చర్యల కిందకు రాదా అని ఆమె అన్నారు. ఢిల్లీలో మీడియా చిట్ చాట్‌లో కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్