ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువకుడు.. ఆగ్రాలోని 40 ఏళ్ల వితంతువుతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 19 ఏళ్ల వయసు తేడా ఉన్న ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వీరి ప్రేమ, పెళ్లి అప్పట్లో సంచలనం సృష్టించగా, ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు వీరి ప్రేమకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు వయసు తేడాపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.