జావా సముద్రంలో 240 మందితో ప్రయాణిస్తున్న నౌక గల్లంతు

ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో 240 మందితో ప్రయాణిస్తున్న నౌక గల్లంతైంది. తూర్పు జావా నుంచి కాళీమంతన్‌కు వెళ్తున్న ‘విర్గో ట్రాన్స్‌పోర్ట్‌ 8’ నౌక.. సురబాయ్‌ నుంచి బయల్దేరిన తర్వాత ఒక్కసారిగా కమ్యూనికేషన్‌ కోల్పోయింది. చివరిసారిగా బంజార్‌మసన్‌కు 148 కిలోమీటర్ల దూరంలో నౌకతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆదివారం ఉదయం నుంచి స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. నౌక ప్రయాణిస్తున్న ప్రాంతంలో ప్రతికూల వాతావరణం ఉన్నట్లు చివరి కమ్యూనికేషన్‌లో తెలిసింది.

సంబంధిత పోస్ట్

✕
✕