నౌకప్రమాదం.. ఆరుగురు మృతి

ఇండోనేషియాలో మరోసారి ఘోర నౌకా ప్రమాదం సంభవించింది. సురాబయా నుండి దక్షిణ కాళీమంతన్‌కు వెళ్తున్న విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8 ప్రయాణీకుల నౌక, ప్రతికూల వాతావరణం కారణంగా జావా సముద్రంలో ఆదివారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 103 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించగలిగారు. ఒకరు మరణించగా, రక్షించిన వారిని తూర్పు జావా ఓడరేవుకు తరలిస్తున్నారు. మిగిలిన 130 మంది ప్రయాణికుల ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕