9 నెలల గర్భంతో శీర్షాసనం.. వీడియో వైరల్

9 నెలల గర్భంతో ఉన్న ఓ మహిళ చేసిన యోగా విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి గర్భధారణ దశలో ఉన్నప్పటికీ ఆమె చక్రాసనం, శీర్షాసనం వంటి క్లిష్టమైన యోగాసనాలను అలవోకగా చేయడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఆమె ప్రొఫెషనల్ యోగా ట్రైనర్ కావడం, ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. నిపుణుల పర్యవేక్షణ, తగిన శిక్షణ లేకుండా గర్భిణులు ఇలాంటి కఠినమైన ఆసనాలు చేయరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణ సమయంలో యోగా చేసే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్