త్రయంబకేశ్వర ఆలయ ప్రాంగణంలోని చారిత్రక 'అమృత్ కుండ'లో దశాబ్దాల తర్వాత శివలింగం వెలుగుచూసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల్లో భాగంగా, 65 అడుగుల లోతులో ఈ పురాతన శివలింగం బయటపడింది. పెష్వాల కాలానికి చెందిన ఈ అమృత్ కుండ నీటినే ఆలయ పూజలకు, అభిషేకాలకు వినియోగిస్తారు. 2026 సింహస్థ కుంభమేళా సన్నాహాల పనుల సమయంలో ఈ అరుదైన ఆవిష్కరణ జరిగింది.