మాఘ మాసంలో శివలింగ పూజ విశిష్ట ఫలితాలు!

తెలుగు సంవత్సరంలో 11వ మాసం మాఘమాసం. ఈ మాసంలో నదీ స్నానం చేసి శ్రీమహావిష్ణువును, శివుడిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. శివ మహాపురాణం ప్రకారం, వివిధ పదార్థాలతో చేసిన శివలింగాలను పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరడం, దీర్ఘకాలిక రోగాలు నయం కావడం, జ్ఞానం వృద్ధి చెందడం, ధన ప్రాప్తి, సంపద వృద్ధి, కీర్తి ప్రతిష్టలు, ప్రేమ వివాహాలు సఫలం కావడం, ఆనందం, గ్రహ దోష నివారణ, ఆహార కొరత తొలగిపోవడం, ఆస్తి లాభం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.

సంబంధిత పోస్ట్