AP: తిరుపతి జిల్లా గూడూరు తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం దర్శనమిచ్చింది. బీచ్‌లో స్నానాలు చేస్తుండగా శివలింగం కనిపించడంతో, యాత్రికులు అతి కష్టం మీద దానిని ఒడ్డుకు చేర్చారు. ఈ అద్భుత దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించి యాత్రికులు ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.