ఆసియా క్రీడల్లో బంగ్లాదేశ్‌కు షాక్.. అనారోగ్యంతో కీలక ప్లేయర్ దూరం

ఆసియా క్రీడల్లో మలేషియాతో క్వార్టర్ ఫైనల్ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు షాక్ తగిలింది. కీలక బ్యాటర్ నజ్ముల్ హసన్ శాంటో అనారోగ్యం కారణంగా జట్టును వీడాడు. జ్వరం కారణంగా స్వదేశానికి తిరిగి రానున్న నజ్ముల్, అక్టోబర్ 9 నుంచి అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టెస్టు మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. రేపు మలేషియాతో బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕