చికెన్, గుడ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇథనాల్ తయారీకి మొక్కజొన్న వినియోగం పెరగడంతో.. పౌల్ట్రీ దాణా ధరలు కూడా పెరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం కిలో చికెన్ సుమారు రూ.250 ఉండగా రూ.400-500 వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. కోడిగుడ్డు ధర రూ.20-25కు చేరొచ్చని పేర్కొంటున్నారు. మొక్కజొన్న కొరత, దాణా ఖర్చులే ప్రధాన కారణాలని పౌల్ట్రీ రంగం చెబుతోంది.