అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్ 13 పరుగులకు ఔట్ అయ్యారు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో 1.3 బంతికి స్లిప్స్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (13) పెవిలియన్ చేరారు. దీంతో 13 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులోకి కరుణ్ నాయర్ వచ్చారు.
Credits: ECB, IG