ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రెపో ఆధారిత రుణ వడ్డీ రేట్లను పెంచాయి. పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రేటు 8.10% నుంచి 8.35%కి చేరింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 7.90% నుంచి 8.15%, ఇండియన్ బ్యాంక్ 7.95% నుంచి 8.20%కి పెంచాయి. కొత్త రేట్లు వెంటనే అమల్లోకి వచ్చాయి. దీంతో ఫ్లోటింగ్ రేట్ గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలు పెరగడం లేదా రుణ కాలపరిమితి పొడిగించే అవకాశం ఉంది.