నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో చికెన్, కోడిగుడ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. గత వారంతో పోలిస్తే కిలో చికెన్ ధర రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగింది. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.287, విజయవాడలో రూ.284గా ఉంది. డజన్ గుడ్ల ధర రూ.70 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. పౌల్ట్రీ మేత, రవాణా ఖర్చులు పెరగడం, పండుగల డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕