ఐపీఎల్ 2026 ఫైనల్ ఆదివారం అహ్మదాబాద్‌లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఆర్సీబీ విజయం సాధిస్తే బెంగళూరులో భారీగా ప్రజలు గుమిగూడతారనే అంచనాతో, నగర పోలీస్ శాఖ 144 సెక్షన్ విధించి, కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. గత సీజన్ విజయోత్సవాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించడంతో, ఈసారి అలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అనుమతి లేకుండా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక సంబరాలు, బైక్ ర్యాలీలు, రోడ్లు బ్లాక్ చేయడం, టపాసులు కాల్చడం వంటివి నిషేధించారు.