లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్(0) డకౌట్ అయ్యారు. జోఫ్రా ఆర్చర్ వేసిన 1.4 బంతికి జైస్వాల్ జెమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరారు. మొదటి ఇన్నింగ్స్‌లోనూ జైస్వాల్ వికెట్ ఆర్చర్‌కే చిక్కింది. కాగా, రెండు ఓవర్లకు భారత్ స్కోరు 5-1గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్ 5, కరుణ్ నాయర్ 0 ఉన్నారు.
Credits: ECB