లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం 7 పరుగులకే ఔట్ అయ్యారు. దీంతో టీమిండియా 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. టంగ్ బౌలింగ్‌లో 9.5 ఓవర్‌కు స్లిప్‌లో ఉన్న జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్ చేరారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్ 46/1గా ఉంది. క్రీజులో జైస్వాల్ (38), సుదర్శన్ (0) పరుగులతో ఉన్నారు.
Credits: ECB