ఎన్నికలకు ముందే విజయ్‌ TVKకు షాక్.. అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ

ఎన్నికలకు ముందు దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గం నుండి బరిలో నిలిచిన పార్టీ అభ్యర్థి అరుణ్‌కుమార్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. నామినేషన్‌లో మద్దతుగా సరిపడా సంతకాలు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అరుణ్‌కుమార్‌కు ప్రత్యామ్నాయంగా టీవీకే పార్టీ నిలబెట్టిన మరో అభ్యర్థి నిత్య నామినేషన్ కూడా ఇదే కారణంతో తిరస్కరణకు గురైంది. ఏప్రిల్ 6న నామినేషన్ గడువు ముగియడంతో, టీవీకే పార్టీకి ఒక సీటు కోల్పోయినట్లయింది.

సంబంధిత పోస్ట్