విరాట్ కోహ్లీకి షాక్.. ఆ పబ్‌కు నోటీసులు

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బెంగళూరు నగర పాలిక అధికారులు షాక్ ఇచ్చారు. బెంగళూరులో విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ పబ్‌కు నోటీసులు జారీ చేశారు. అగ్ని మాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండానే పబ్ నిర్వహిస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో బీబీఎంపీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 7 రోజుల్లోగా సమాధానం రాకపోతే చర్యలు తీసుకుంటామని శాంతినగర్ డివిజన్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్