TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ దుబ్బాకలో BRSకు బిగ్ షాక్ తగిలింది. దుబ్బాక పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందులో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తనను మోసం చేశాడని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం టికెట్ తనకే ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, ఇప్పుడు పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తనని తప్పించాలని చూస్తున్నారని వాపోయారు. తన ఆత్మగౌరవం దెబ్బతినకూడనే ఈ నిర్ణయం తీసుకున్నానని వంశీకృష్ణ తెలిపారు.