హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ దంపతులు హస్తం పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం ఆదివారం ఉదయం శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, బీఆర్ఎస్ ఇంచార్జి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించి, తెలంగాణ భవన్ కు తరలివెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.