కస్టమర్లకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్‌ రోజులను తగ్గించిన BSNL

బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. సంస్థ తన రూ.107 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును సైలెంట్‌గా 28 రోజుల నుంచి 22 రోజులకు తగ్గించింది. గతంలో ఇదే ప్లాన్‌కు 35 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ధర పెంచకుండా రోజులు తగ్గించడం 20% కంటే ఎక్కువ టారిఫ్ పెంపుతో సమానమని టెక్ నిపుణులు అంటున్నారు. ఈ మార్పుపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్లాన్‌ను మునుపటి స్థితికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్