సామాన్యులపై మరో భారం పడనుంది. మహారాష్ట్రలో ఆగస్టు 11 నుంచి ఆవు, గేదె పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు పాడి సహకార, ప్రైవేట్ డెయిరీల సమాఖ్య ప్రకటించింది. పశువుల దాణా ధరలు, నిర్వహణ ఖర్చులు పెరగడంతో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పెరుగుతున్న వ్యయాలను తట్టుకునేందుకు ధరల పెంపు అనివార్యమైందని డెయిరీ వర్గాలు పేర్కొన్నాయి. చాలా రాష్ట్రాల్లో పాల ధరలు పెరిగాయి. కాగా, పాలకు కనీస మద్దతు ధర నిర్ణయించే ప్రతిపాదన లేదని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది.