సామాన్యులకు షాక్.. చింతచిగురు ధర కేజీ రూ.1000

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఇష్టంగా తినే చింతచిగురు ధరలు భారీగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో కేజీ చింతచిగురు రూ.1000 వరకు పలుకుతుండగా, హైదరాబాద్‌లో రూ.800 వరకు విక్రయిస్తున్నారు. వర్షాల కొరతతో చింత చెట్లకు కొత్త చిగురు సరిగా రాకపోవడం, మార్కెట్లలో సరఫరా తగ్గిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. సేకరణ, రవాణా ఖర్చులు కూడా పెరగడం మరో కారణం. చింతచిగురులో విటమిన్-సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో డిమాండ్ తగ్గడం లేదు. అయితే మటన్ ధరలకు సమానంగా మారిన చింతచిగురు ప్రస్తుతం సామాన్యులకు భారంగా మారింది.

సంబంధిత పోస్ట్