రిటైర్మెంట్ వార్తల తర్వాత రోహిత్ శర్మ బ్యాట్‌తో అదరగొడుతున్నాడు. జులైలో లార్డ్స్ వన్డేకు ముందు వచ్చిన రిటైర్మెంట్ వార్తల మధ్య 138 పరుగుల సెంచరీతో సత్తా చాటిన హిట్‌మ్యాన్.. తాజాగా వెస్టిండీస్‌తో సిరీస్‌లో 32, 101, 92 పరుగులతో మెరిశాడు. ఈ క్రమంలో రిటైర్మెంట్ వార్తల తర్వాత ఆడిన 4 వన్డేల్లో 90.75 సగటుతో 363 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా రోహిత్ రాకెట్లా దూసుకెళ్తున్నాడు.