షాకింగ్ యాక్సిడెంట్.. గాల్లోకి ఎగిరిపడ్డాడు(వీడియో)

రాజస్థాన్‌లోని సికార్ జిల్లా శ్యామ్‌జీ రోడ్డుపై భయంకరమైన బైక్ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైకర్, అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను బలంగా ఢీకొట్టాడు. ఈ క్రమంలో గాల్లోకి ఎగిరి బోర్డును తాకిన యువకుడు అమాంతం రోడ్డుపై పడ్డాడు. అంతటి తీవ్ర ప్రమాదం జరిగినప్పటికీ, ఆశ్చర్యకరంగా యువకుడు స్వయంగా లేచి నిలబడటం స్థానికులను విస్మయానికి గురిచేసింది. ఆ సమయంలో రోడ్డుపై పెద్ద వాహనాలు రాకపోవడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.

సంబంధిత పోస్ట్

✕
✕