ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బలియాపాల్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని మరో బైకర్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను రక్షించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.