అంగన్ వాడీ సెంటర్ లో చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో జరిగింది. అంగన్‌వాడీలో పిల్లలకు పప్పు ఖిచడి ప్రీమిక్స్ ప్యాకెట్లు అందిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలకు అందిన ప్యాకెట్‌లో చనిపోయిన పాము కనిపించిందని పిల్లల్లో ఒకరి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై పేరెంట్స్ రాష్ట్ర అంగన్ వాడీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఆనంది బోసలేకి ఫిర్యాదు చేశారు.