కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో సామాజిక, నైతిక విలువలను పక్కనపెట్టి అక్కాతమ్ముళ్లు పెళ్లి చేసుకున్న ఘటన కలకలం రేపింది. శశికళ, ప్రవీణ్ తల్లులు అక్కాచెల్లెళ్లు కాగా, ప్రవీణ్ కంటే శశికళ వయసులో పెద్దది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ, శశికళ వివాహం ఖాయం కావడంతో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తమ కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.