AP: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు వైద్యుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ప్రమోషన్‌కు అడ్డుగా వస్తున్నారనే కారణంతో అనస్తీషియా వైద్యురాలు లక్ష్మి మోనాలిసా తనపై చేతబడి చేయించారని ఎండీ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఆది నాగశేషు ఆరోపించారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమెపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్‌లో తన పేరు ఉన్న కవర్‌తో పాటు నిమ్మకాయలు, బూడిద ఉన్న మరో కవర్ కనిపించిందని పేర్కొన్నారు.