TG: మెదక్ జిల్లా రామాయంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న నవనీత్ అనే యువకుడు రోడ్డు పక్కన నిలిపిన లారీని నేరుగా వెనుక నుంచి వచ్చి ఢీకొట్టాడు. ఆ ప్రాంతంలో టర్నింగ్ పాయింట్ లేకపోయినా, వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్నా సరే ఈ ఘటన జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. తీవ్ర గాయాలపాలైన నవనీత్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.