ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో రద్దీగా, ఇరుకుగా ఉన్న మార్కెట్ రోడ్డులోకి థార్ వాహనం దూసుకొచ్చింది. అక్కడ పార్క్ చేసిన పలు బైకులను ఢీకొట్టింది. ఆ తర్వాత వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో అక్కడున్న జనం షాక్ అయ్యారు. ఆ వాహనం నుంచి తప్పించుకునేందుకు పక్కలకు పరుగులు తీశారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది.