అమెరికాలో ఓ కుటుంబంపై కాల్పులు.. భార్యాభర్తలకు తీవ్ర గాయాలు (వీడియో)

అమెరికాలోని చికాగోలో ఓ కుటుంబంపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కారులో ఉన్న కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ముగ్గురు దుండగులు పరిగెత్తుకుంటూ వచ్చి కనీసం రెండు డజన్ల రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో కారులోని భార్యాభర్తలకు తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే కారు వెనుక సీట్లో ఉన్న చిన్నారి మాత్రం సురక్షితంగా బయటపడింది. పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్