జర్మనీలో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనకు పాల్పడ్డ ఇద్దరు సాయుధ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన అనంతరం భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసిన అధికారులు, ప్రజలు సంఘటన స్థలానికి దూరంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కాల్పులకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.