హోటల్‌లో కాల్పులు.. ఆరుగురు మృతి

అస్సాం రాజధాని గౌహతిలోని లాచిత్ నగర్‌లో గల 'హోటల్ బిలాస్ ఇన్'లో సోమవారం రాత్రి దారుణ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో హోటల్ యజమాని హెలీనా భరాలి, ఆమె కుమారుడు సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు మరణించారని గౌహతి పోలీసు కమిషనర్ ధృవీకరించారు. ఆస్తి వివాదమే ఈ కాల్పులకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి వివరాలు తెలియాల్సి ఉండగా, ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

సంబంధిత పోస్ట్

✕
✕