TG: హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఇవాళ కొందరు దుండగులు చందు నాయక్ అనే వ్యక్తిపై కాల్పులు జరపడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కొద్దిసేపటికే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కాల్పులకు పాల్పడిన నలుగురు నిందితులు ఎస్వోటీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులు రాజేష్, శివతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.