ఫ్రాన్స్ రాజధాని పారిస్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. కారులో వచ్చిన ఓ దుండగుడు రోడ్డుపై ఉన్నవారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.