సంతలో కాల్పులు.. 62 మంది మృతి

నైజీరియాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. దేశంలోని ఒక సంతలో సాయుధులైన నేరగాళ్లు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదకరమైన దాడిలో మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొనగా, వేలాది మంది గ్రామస్తులు ప్రాణాలు కాపాడుకునేందుకు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈ దురాగతం పట్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕