అమెరికాలో దారుణం.. భార్యతో పాటు ముగ్గురు బంధువుల్ని కాల్చి చంపిన ఎన్నారై

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు భారత సంతతి వ్యక్తులు మృతి చెందారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ భర్త.. భార్య, ఆమె బంధువులపై కాల్పులు జరిపాడు. మృతులను మీము డోగ్రా, గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీశ్ చందర్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడైన విజయ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్