AP: శ్రీకాకుళం జిల్లాలోని పలాస పట్టణంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఏకంగా షాపు యజమానికి బేడీలు వేసి ముప్పావు కేజీ బంగారంతో ఉడాయించారు దొంగలు. పోలీసుల వివరాల ప్రకారం.. పలాసలో కిల్లంశెట్టి రామకృష్ణ అనే వ్యక్తి వెంకటేశ్వర జ్యుయలరీ పేరుతో షాపు నడుపుతున్నాడు. మంగళవారం ఆరుగురు వ్యక్తులు జీఎస్టీ అధికారులమంటూ షాపులోకి వచ్చారు. చెక్ చేయాలని చెప్పి.. రామకృష్ణకు బేడీలు వేశారు. ఆ తర్వాత షాపులోని బంగారం దోచుకెళ్లారు. చోరీ జరిగినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.