షార్ట్ ఫిలిం నటి కేసు.. బెయిల్‌పై వచ్చిన నిందితుడు మృతి

హైదరాబాద్ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో షార్ట్‌ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న 19 ఏళ్ల మేఘావత్ నారాయణ అలియాస్ మహేష్, బెయిల్‌పై విడుదలైన కొద్దిరోజులకే ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మహేష్‌పై కావాలనే తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపించారని, అమాయకుడైన తమ కుమారుడు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్