జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ బైరాయిత్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం, పిల్లలు, యువత షార్ట్ వీడియోలకు ఎక్కువగా అలవాటు పడటం వల్ల వారిలో ఏకాగ్రత లోపించి, ఒత్తిడి స్థాయిలు పెరిగే అవకాశం ఉందని వెల్లడైంది. యూరోపియన్ చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రీ జర్నల్‌లో జూన్ నెలలో ప్రచురితమైన ఈ అధ్యయనం, స్పీడ్ కంటెంట్ డెలివరీ, ఎండ్‌లెస్ స్క్రోలింగ్, పర్సనలైజ్డ్ అల్గారిథమ్స్ వంటివి దీనికి ప్రధాన కారణాలని పేర్కొంది.