షాట్‌పుట్ ప్లేయర్ జాస్మిన్ కౌర్‌‌పై సస్పెన్షన్

భారత ప్రముఖ షాట్‌పుట్ ప్లేయర్ జాస్మిన్ కౌర్‌‌పై డోపింగ్ నిరోధక సంస్థ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో ఆమెపై సస్పెన్షన్ వేసినట్లు తాజాగా ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులు విస్మయానికి గురవుతున్నారు. అయితే 22 ఏళ్ల జాస్మిన్ ఈ ఏడాది డెహ్రాడూన్‌లో జరిగిన క్రీడల్లో 15.97 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ త్రోతో గోల్డ్ మెడల్ సాధించగా.. గతేడాది జరిగిన యూనివర్సిటీ లెవల్ పోటీల్లో 14.75 మీటర్ల త్రో చేసి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.

సంబంధిత పోస్ట్