TG: మీడియాపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసినందున పోలీసులు మోహన్ బాబును ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10న రాత్రి జల్ పల్లిలోని మోహన్ బాబు హౌస్ దగ్గర కవరేజ్ కు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి జరిగిన సంగతి తెలిసిందే.