TG: రాష్ట్రంలోని పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకల కోసం ప్రభుత్వం పశువుల బీమా పథకాన్ని ప్రారంభించడంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 'రైతు బీమా' పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపణలు వస్తున్న తరుణంలోనే ప్రభుత్వం పశువుల బీమా పథకాన్ని ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఆపద్బాంధవుగా నిలిచిన రైతు బీమాను పక్కనబెట్టడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. 'రైతు బీమా రద్దు.. పశువుల బీమా ముద్దు' అంటూ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.