నటుడు తిరువీర్ హీరోగా నటిస్తున్న 'భగవంతుడు' సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో విశ్వక్‌సేన్, తాను మొదట తీసిన 'ఫలక్‌నుమా దాస్' సినిమాలో తిరువీర్ తనతో కలిసి నటించాల్సి ఉందని, కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని తెలిపారు. 'భగవంతుడు' సినిమా సమ్మర్‌లో విడుదల కానుంది. తిరువీర్ 'ఓ సుకుమారి' అనే మరో సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.