ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. హిందీ నేర్చుకోమని ఎవరిని బలవంతం చేయడం లేదని స్పష్టంచేసిన ఆయన, హిందీ నేర్చుకోవడం వల్ల తమ ఉనికిని కోల్పోవడం కాదని, దేశంలో మూడవ అత్యధికంగా మాట్లాడే భాషను నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఉంటాయని అన్నారు. అయితే ఐటీ వంటి రంగాల్లో ఇంగ్లీష్ తప్పనిసరి అని, హిందీ నేర్చుకుంటే ఏం లాభమని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.