"జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలా? ఇటీవల జైలుకు వెళ్లిన తర్వాత కూడా రాజీనామా చేయని ధోరణి కనిపిస్తుంది. తమిళనాడు, ఢిల్లీలో మంత్రులు, సీఎం జైలుకు వెళ్లినా రాజీనామా చేయలేదు. జైలుకెళ్తే రాజీనామా చేయాల్సిందే" అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 30 రోజులు జైలులో ఉంటే పదవి కోల్పోయే బిల్లును కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది.