పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డికి షోకాజ్‌ నోటీసు

TG: పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రిమినల్‌ కేసుల్లో ఉన్నట్లు ఆరోపణల దృష్ట్యా ఈ నోటీసు జారీ చేశారు. కామారెడ్డి కార్యకర్తలు, నేతలు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈనెల 11 లోపు సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసులో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్